ప్రైవేట్ పాఠశాల కళాశాలలో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి
– టి యన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పేరు సుభాన్.
గద్వాల నడిగడ్డ, నవంబర్ 30 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రవేట్ పాఠశాల,కళాశాలల యజమాన్యం విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు వసూలు చేస్తున్నారని బుధవారము టి ఎన్ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పేరు సుభాన్ మాట్లాడుతూ ప్రైవేట్ ఇంటర్మీడియట్, డిగ్రీ,కళాశాలలో విద్యార్థుల నుండి కాలేజీ ఫీజు, ల్యాబ్ ఫీజు, లైబ్రరీ ఫీజు, రికార్డ్స్ ఫీజు అంటూ రకరకాల పేర్లతో విద్యార్థుల ముక్కపిండి ఫీజులు వసూలు చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. అధిక ఫీజుల భారంతో పేద విద్యార్థుల చదువులు అందరిని ద్రాక్షగా మారిందని వారి ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజు నేటితో ముగిస్తుండగా ప్రైవేట్ కళాశాల యజమాన్యం మాత్రం అన్ని ఫీజులు కడితేనే ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటామంటూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ, తక్షణమే ఎలాంటి ఫీజులు లేకుండా ఎగ్జామ్ ఫీజు కట్టించుకునేలా ప్రైవేట్ యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధిక ఫీజులు వసూలు చేయడంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని వారి ఆవేదన వ్యక్తం చేశారు.ప్రైవేట్ పాఠశాల కళాశాలలో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలనీ నేటితో ముగిస్తున్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫీజు తేదీను పొడిగించాలనీ, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలనీ, ప్రైవేట్ పాఠశాల కళాశాలలో ఎలాంటి ఫీజులు లేకుండా ఎగ్జామ్ ఫీజులు కట్టించుకునేలా ప్రైవేటు యజమానియాలపై చర్యలు తీసుకోవాలనీ,ప్రైవేట్ పాఠశాల కళాశాలలో ఫీజుల పట్టికను ఏర్పాటు చేయాలనీ,ప్రైవేట్ పాఠశాలలో చిమ్మ చీకటిలో కూడా ప్రవేట్ విద్యా సంస్థలు నడుస్తున్నాయనీ, సమయపాలన పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలనీ ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్రబాబు, జిల్లా ఉపాధ్యక్షులు గంజిపేట రాకేష్, ఆనంద్,వంశీ, తరుణ్,
నరేష్,కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ పాఠశాల కళాశాలలో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి




