తుంకుంట మున్సిపాలిటీ ఓబీసీ సెల్ అధ్యక్షుడుగా లక్ష్మి నారాయణ :శామీర్ పేట్, జనం సాక్షి :
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో బుధవారం రోజు మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ పరిధిలోని తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ నూతన అధ్యక్షుడిగా పెండం లక్ష్మీనారాయణ నియమించారు .
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ,టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ,మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్ ,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్ చేతుల మీదుగా నూతనంగా నియమితులైన తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షుడు పెండం లక్ష్మీనారాయణకి నియామక పత్రం అందజేశారు .
ఈ సందర్బంగా నందికంటి శ్రీధర్ గారు,సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, తోటకూర వజ్రేష్ యాదవ్ , గువ్వ రవి ముదిరాజ్ , మాట్లాడుతూ… ఓబీసీ సెల్ నూతన అధ్యక్షులుగా నియమితులైన పెండం లక్ష్మీనారాయణని అభినందించి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలసి కట్టుగా పనిచేసి,అందరిని సమన్వయం చేసుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయ్యాలని సూచించినారు.
ఈ సందర్భంగా పెండం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షుడుగా నియమించినందుకు గాను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్ కి ధన్యవాదాలు తెలిపారు. పదవి రావడానికి సహకరించిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ కి,టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి,మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డికి,మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్ కి,తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొగుళ్ల శ్రీనివాస్ రెడ్డి ,మాజీ ఉపసర్పంచ్ తిరుపతి శంకర్ గౌడ్ ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కందాల రాము , తదితరులు పాల్గొన్నారు.
30 ఎస్పీటీ -1: నియామక పత్రం అందుకుంటున్న లక్ష్మి నారాయణ
తుంకుంట మున్సిపాలిటీ ఓబీసీ సెల్ అధ్యక్షుడుగా లక్ష్మి




