ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తప్పవు. డీపీవో శ్రీనివాస్.
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోనాల గ్రామ పంచాయతీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పై డి పి ఓ శ్రీనివాస్ అన్ని వ్యాపార సముదాయాల యజమానులకు అవగాహన కల్పించారు. అన్ని వ్యాపార సముదాయాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని బట్ట మరియు పేపర్ కవర్లు వాడాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలియజేశారు. ప్లాస్టిక్ వాడే కొన్ని షాపులకు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెట్ల పెళ్లి సదానందం గారు M p o జీవన్ రెడ్డి. ఎంపీడీవో రాజేశ్వర్. మండల స్పెషల్ ఆఫీసర్ J D A శ్రీధర్ స్వామి A P O జగ్డే రావ్. పంచాయతీ సెక్రెటరీ స్వామి మరియు రామయి శంకర్ శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు.