హైదరాబాద్,సెప్టెంబర్24 జనం సాక్షి : ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన వేణుమాధవ్‌ను అభిమానులు, నటీనటుల కడసారి చూపు కోసం గురువారం మధ్యాహ్నం ఫిల్మ్‌ఛాంబర్‌కు తీసుకొచ్చారు. ఛాంబర్‌లో వేణుమాధవ్ పార్థివ దేహానికి ఆయన అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. వేణుమాధవ్ కడసారి చూపు కోసం భర్తతో కలిసి ఛాంబర్‌కు వచ్చిన సీనియర్ యాంకర్ ఉదయభాను కన్నీటి పర్యంతమయ్యారు. వేణుమాధవ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఫిల్మ్‌ఛాంబర్‌లో వేణుమాధవ్‌కు కన్నీటి నివాళులర్పించిన ఉదయభాను




