ఎర్గట్ల ఏప్రిల్ 19 (జనంసాక్షి): నిజామా బాద్ జిల్లా ఏర్గట్ట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎన్ ఆర్ జి ఎస్ అధికారులతో మరియు అన్ని గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కర్నె రాజేశం మాట్లాడుతూ హరితహారం మొక్కల నర్సరీలలో పెరుగుతున్న మొక్కలకు నీరు అందించడమే కాకుండా కొత్తగా పెట్టిన మొక్కలు ఏవైనా మొలవకపోతే వెంటనే మళ్ళీ కొత్త విత్తనాలు నాటాలని మొక్కలు పెరిగేటట్టు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో ఆక్టివ్ జాబు కార్డులు కలిగిన వారిలో కనీసం 35 శాతం జాబ్ కార్డులు కలిగిన వారు ఉపాధి హామీ పనికివచ్చేలా చర్యలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఎన్ ఆర్ జి ఎస్ అధికారులకు సూచించారు అలాగే ఉపాధి హామీ పనికి వచ్చిన వారికి పని ఉన్నచోట నీడను, ప్రథమ చికిత్స అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్ఆర్ జి ఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




