జుక్కల్,ఎప్రిల్19,( జనంసాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలోని తాహాసీల్ కార్యాలయం ముందు బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో పోడు రైతులు ధర్నా చేశారు.ఈ నెలాఖరులోగా పోడు రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వక పోతే మే నెల మొదటివారంలో జుక్కల్ మండల రైతులతో జుక్కల్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని సిపిఎం కామారెడ్డి జిల్లా కమిటీ సభ్యుల సురేశ్ గొండ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భూప్రక్షాళన పేరిట దళిత, గిరిజనుల, బిసి కులాల రైతుల భూములను ఈ ప్రభుత్వం గుంజుకుందని విమర్శించారు. ధర్నా అనంతరం జుక్కల్ తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సి పి ఎం నాయకులు సి హెచ్. మోతిరాం, బి. ఆడేప్ప, కంబ్లె శ్రీనివాస్, ఇ. విట్టల్, టి, సాయిలు, ఆర్, కాశీరాం, మహిబూబ్ సాబ్, శేఖ్ ఆహేమద్, మారుతీ, కె.లక్ష్మి బాయి, గోదావరి, గంగవ్వ, టి.పారెవ్వ, కె. నర్సవ్వ, మైషవ్వ తదితరులు పాల్గొన్నారు.




