Monday, 2 November 2026

ఫొటో నిబంధనతో… ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీ

హైదరాబాద్‌ సిటీ : రవాణా శాఖలో కొత్త నిబంధనలు వాహనదారులను ఆర్టీఏ కార్యాలయాలకు పరుగులు పెట్టిస్తున్నాయి. ఫలితంగా ప్రతి రోజూ ఆర్టీఏ కార్యాలయాలు రద్దీగా మారుతున్నాయి. చిన్న పాటి పనికైనా గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల కొత్తగా ప్రవేశ పెట్టిన నిబంధనలే రద్దీ పెరగడానికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు కేవలం డ్రైవింగ్‌ లైసెన్సుల కోసం వచ్చే వారే ఫొటోలు దిగేవారు. తాజాగా వచ్చిన కొత్త నిబంధనతో కొత్త వాహనం కొనుగోలు చేసిన వారు ఎవరైనా సరే రిజిస్ర్టేషన్‌ సమయంలో ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చి ఫొటో దిగాలి. దీనికి తోడు ఆర్టీఏలో ఎలాంటి లావాదే వీకైనా ఆధార్‌ కార్డు తప్పనిసరి అనే నిబంధనను అమ లు చేస్తున్నారు. ఫొటోలు దిగడానికి, ఆధార్‌కార్డులు చూపించడానికి వస్తున్న వారితో రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కేంద్ర కార్యాలయంగా ఉన్న ఖైరతాబాద్‌ ఆర్టీఏలో ఈ రద్దీ ఎక్కువగా ఉంది. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి, ఉప్పల్‌, ఇబ్రహీంపట్నం, అత్తాపూర్‌, మేడ్చల్‌, కూ కట్‌పల్లి, మేడ్చల్‌ ఆర్టీఏ కార్యాలయాల్లోనూ రద్దీఉం టోంది. ఉదయం 10 నుంచి 2 గంటల వరకే లావాదేవీల సమయం కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరుగుతోంది.రాష్ట్రంలోనే అత్యధికంగా ఖైరతాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో కొత్త వాహనాల రిజిస్ర్టేషన్‌లు జరుగుతుంటాయి. రోజూ 200లకు పైగా వాహనాలు ఇక్కడ రిజిస్ర్టేషన్‌కు వస్తుంటాయి. ఆయా వాహనాలకు చెంది న యజమాని తప్పనిసరిగా రావాలి. వీటిలో అత్యధికంగా కార్లు, ద్విచక్ర వాహనాలు ఉంటున్నాయి. మిగతా చోట్ల సైతం 80 నుంచి 100 కొత్త వాహనాలు, లర్నిం గ్‌ లైసెన్సు కోసం వచ్చే వారు సైతం రోజుకు వందల సంఖ్యలో ఉంటున్నారు. ఏపని అయినా గంటల తరబ డి వేచిఉండాల్సి వస్తోంది. రెండు వారాలుగా ఖైరతాబాద్‌లో వాహనాలు నిలిపేందుకు స్థలం ఉండడం లేదు. దీంతో రోడ్డుమీదే వాహనాలను నిలిపివేస్తున్నారురాష్ట్ర రవాణా శాఖకు వచ్చే ఆదాయంలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచే అత్యధికంగా ఉంటోం ది. రాష్ట్ర వార్షిక ఆదాయం రూ.2500 కోట్లు కాగా అందులో రెండు జిల్లాల నుంచే రూ.1535 కోట్ల ఆదా యం వస్తోంది. దీంతో గ్రేటర్‌ పరిధిలోని 10 ఆర్టీఏ కార్యాలయాల్లో లావాదేవీలు చాలా ఎక్కువగానే ఉం టున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో 436 ఖాళీలు ఉన్నాయి. ఏళ్ల తరబడిగా కొత్త నియామకాలు, ప్రమోషన్‌లు లేవు. దీంతో ఉన్న సిబ్బందితోనే కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కొత్త వాహనాల రిజిస్ర్టేషన్‌లు రెండు జిల్లాల నుంచే అధికంగా ఉంటాయి. వీటికి తోడు డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ, ఫిట్‌నెస్‌, ట్రాన్స్‌ఫర్స్‌, ఇతర లావాదేవీలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ కార్యాలయాల్లో అవసరాల మేరకు సిబ్బంది లేరు. వీటికితోడు కొత్త నిబంధనల అమలుతో పనిభారం మరింత పెరిగింది. సిబ్బంది కొర త తీవ్రంగా ఉందని, చాలా ఏళ్లుగా కొత్త ఉద్యోగాల నియామకాలు లేక ఉన్నసిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు.రవాణా శాఖలో కంప్యూటరైజేషన్‌ ఉన్నా పనిభారం చాలా ఎక్కువగానే ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రతి లావాదేవీని వ్యక్తిగతంగా కింది స్థాయి నుంచి ఆర్టీఓ స్థాయి అధికారి వరకు చూడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఒక ఫైలు పని పూర్తి కావడానికి గంటల తరబడి సమయం పడుతోంది. ఇందులో కంప్యూటర్లపై పనిచేయడంతో పాటు వ్యక్తిగతంగా చూసి చేయాల్సి వస్తోంది. ఉదాహరణకు ఒక వాహనాన్ని వేరొకరికి అమ్మినప్పుడు కొన్న యజమానితో పాటు అమ్మిన వారు నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి వ్యక్తిగతంగా వచ్చి గుర్తింపు ధ్రువపత్రాలను చూపించాల్సి వస్తోంది. ఇలా పలు అవసరాల కోసం వాహనాల యజమానులే స్వయంగా రావాల్సి వస్తోంది. కంప్యూటర్‌లతో పనిచేస్తూనే వాహనదారులతో మాట్లాడిన పరిస్థితులు ఉన్నా యి. దీంతో తప్పనిసరిగా వేచి ఉండాల్సి వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *