3,698 హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌లు రీకాల్‌

ip29j431అమెరికా ప్రీమియం బైక్‌ దిగ్గజం హార్లే డేవిడ్‌సన్‌ తయారీలో లోపాలు తలెత్తటంతో ఎక్స్‌జి750 మోడల్‌కు చెందిన 3,698 బైక్‌లను వెనక్కు (రీకాల్‌) తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 2015లో తయారైన ఎక్స్‌జి 750 మోడల్‌ బైక్‌.. ఫ్యూయల్‌ పంప్‌ ఇన్‌లెట్‌లో సమస్య తలెత్తటంతో వీటిని స్వచ్ఛందంగా రీకాల్‌ చేస్తున్నట్లు తెలిపింది. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రకటన చేసినట్లు హార్లే డేవిడ్‌సన్‌ పేర్కొంది. ఈ ఏడాది ఎక్స్‌జి 750 మోటార్‌ సైకిల్స్‌ను కొనుగోలు చేసిన కస్టమర్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని భారత్‌లోని డీలర్లకు ఇప్పటికే తెలియజేసినట్లు హార్లే డేవిడ్‌సన్‌ ఇండియా పేర్కొంది. వాహనాల్లో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వినియోగదారుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఆయా వాహనాలను స్వచ్ఛందంగా వెనక్కు తీసుకోవాలని 2012 జూలై నుంచి ఆటో పరిశ్రమ సమాఖ్య సియామ్‌ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.