ఫోటోగ్రాఫర్స్ కు క్రికెట్ కిట్టు పంపిణీ.ఫోటో గ్రాఫర్స్ క్రీడల్లో రాణించాలి.ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మాజీ జిల్లా అధ్యక్షులు రమేష్ కొప్పుల.నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఫోటోగ్రాఫర్స్ కు నాగర్ కర్నూల్ జిల్లా ఫోటో గ్రాఫర్స్ యూనియన్ మాజీ జిల్లా అధ్యక్షులు రమేష్ కొప్పుల స్థానిక బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో క్రికెట్ కిట్టును పంపిణీ చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు జిల్లా అధ్యక్షులు నేతాజీ గౌడ్ పాల్గొని వారు రమేష్ కొప్పులను అభినందించారు.అనంతరం రమేష్ కొప్పుల మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ వృత్తి పరంగానే కాకుండా క్రీడారంగంలో రాణించాలని, ఫోటోగ్రాఫర్ వృత్తికి మంచి పేరు తేవాలని అన్నారు.క్రీడలు ఆడడం వలన శరీరానికి అలిసిపోయి శరీరం కాస్త ఉత్తేజంగా ఏర్పడుతుందని అన్నారు.ఈ మధ్యకాలంలో ఎక్కువగా గుండెపోటు మరణాలు చూస్తున్నామని కావున క్రీడల్లో పాల్గొంటే మనిషి యొక్క అవయవాలు ఉల్లాసంగా ఉండి మనిషి శరీరంలో రక్తప్రసరణ మంచిగా జరిగి ఆరోగ్యంగా ఉంటారని వారు అన్నారు.సెల్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సెల్ఫోన్ల ద్వారా ఫోటోసు వీడియోస్ తీసుకోవడం వలన మాకు వృత్తిపరంగా వ్యాపారాలు జరగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కావున రాష్ట్ర ప్రభుత్వం మా యందు దయ ఉంచి మా ఫోటోగ్రాఫర్స్ కు హెల్త్ కార్డ్స్ మరియు ఫోటోగ్రాఫర్స్ కు డబుల్ బెడ్ రూమ్ మాదిరిగా మాకు కూడా ఫోటోగ్రాఫర్స్ కాలనీ ఏర్పాటు చెయ్యాలని కోరారు రాబోయే రోజుల్లో మా ఫోటోగ్రాఫర్స్ కూడా క్రీడా రంగంలో పాల్గొని మన ఫోటోగ్రాఫర్ వృత్తికి మంచి గుర్తింపు తేవాలని ఈ సందర్భంగా వారు కోరారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ యాదవ్ జిల్లా కోశాధికారి కేశవ్ మాజీ జిల్లా అధ్యక్షులు గంధం ప్రసాద్ తాలూకా అధ్యక్షులు రాఘవులు ప్రధాన కార్యదర్శి బెల్లం నరసింహ కోశాధికారి శివ ఎత్తపు సలహాదారులు శ్రీకాంత్ బూసిపాగ శ్రీనివాసులు బురాన్ నాగరాజు సీనియర్ ఫోటోగ్రాఫర్ బాబా పాషా ఉప్పల నరేష్ సలీం దేవగౌడ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటోగ్రాఫర్స్ కు క్రికెట్ కిట్టు పంపిణీ.




