Thursday, 5 November 2026

ఫోటో ఎక్స్పో పోస్టర్ విడుదల చేసిన ఎం ఎల్ ఎ దుర్గం చిన్నయ్య

ఫోటో ఎక్స్పో పోస్టర్ విడుదల చేసిన ఎం ఎల్ ఎ దుర్గం చిన్నయ్య, జెడ్ పి టి సి సాలిగామ బానయ్య
తాండూర్/బెల్లంపల్లి నవంబర్ 17 (జనం సాక్షి)

తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్ బి నగర్కె వి ఆర్ కన్వెన్షన్ లో నవంబర్ 18, 19, 20, తేదీ న ఫోటో ఎక్స్పో నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్న లక్ష మంది ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా ఈ ఎక్స్పో ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడం ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ నూతన టెక్నాలజీకి అందిపుచ్చుకునేందుకు ఇంటర్నేషనల్ కంపెనీలు ఈ యొక్క స్టాల్స్ ని నిర్వహిస్తూ ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కి వారి యొక్క కెమెరాలు గాని సాఫ్ట్వేర్లు గాని ఫోటో వీడియో గ్రాఫిక్ సంబంధించిన వందలాది స్టాల్స్ వారి యొక్క కంపెనీల కెమెరాల గురించి మరి ఇతర ఎల్ఈడీ వాల్స్ డ్రోన్స్ తదితర ఈ రంగానికి సంబంధించిన అన్ని కంపెనీలు ఒక వేదికపై రావడం వలన రాష్ట్రంలో ఉన్న ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఎంతగానో ఉపయోగపడే ఈ ఎక్స్ పో నీ ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ సద్వినియోగం చేసుకోవాలని ఈ యొక్క ఎక్స్పోకు సంబంధించిన పోస్టర్ లాంచింగ్ కార్యక్రమాన్ని తాండూర్ మండలంలో ని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎం ఎల్ ఎ దుర్గం చిన్నయ్య చేతుల మీదుగా అదే విధంగా తాండూర్ మండల జడ్పిటిసి బానయ్య చేతుల మీదుగా ఈ యొక్క పోస్టర్ లాంచింగ్ చేసుకోవడం జరిగింది. వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీ యొక్క రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించుకొనుటకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్న మీ యొక్క రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రఫీ సంక్షేమ సంఘాన్ని వారు అభినందించారు ఈ కార్యక్రమం లో తాండూర్ మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేడిపల్లి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పుప్పాల శోభన్, కోశాధికారి రామటంకి రమేష్, ఉపాధ్యక్షులు మోహిన్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు సాయి, రఫీ, రవి, పుప్పాల సురేష్, రంజిత్ మహంకాళి క్రిష్ణ పాల్గొన్నారు