Thursday, 5 November 2026

డైలీ వర్కర్ల గోడును పట్టించుకోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

డైలీ వర్కర్ల గోడును పట్టించుకోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
డైలీ వేజీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
*కోయగూడెంలో దీక్షా శిబిరం వద్ధ సంఘీభావం మద్దతు తెలిపిన రాజకీయ,విద్యార్థి,యువజన సంఘాల నేతలు

టేకులపల్లి, నవంబర్ 17( జనం సాక్షి): గత 20 రోజుల నుండి తమ సమస్యలు పరిష్కరించాలని, ఏండ్ల తరబడి ఎట్టి చాకిరి చేస్తున్న తమ ఉద్యోగాలకు భద్రత కల్పించడం లేదని దీక్షలు చేపట్టిన డైలివేజీ వర్కర్ల సమస్యలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించాలని ప్రజాపంధ టేకులపల్లి మండల కార్యదర్శి డివీబి చారి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు మోకాళ్ళ రమేష్,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ టేకులపల్లి మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు, విద్యార్థి యువజన సంఘం నేతలు నోముల బానుచందర్, కాంపాటి పృధ్వీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని టేకులపల్లి మండలం కోయగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల ముందు ధర్నా చేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల దీక్షా శిబిరం వద్ద రాజకీయ పార్టీలు, విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 ఏళ్ల నుండి ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించకున్నా టైం స్కేల్ లేకున్నా గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఎట్టి చాకిరి చేస్తున్న డైలీవేజీ వర్కర్ల సమస్యలు ప్రభుత్వం పెడచవిని పెడుతూ వారిపట్ల కనీస మానవీయ కోణం నుండి కూడా చూడని దౌర్భాగ్య పరిస్థితి ఉందని,పదేళ్ల కాలంలో మూడు సార్లు దీక్షలు చేపట్టినా ఉమ్మడి రాష్ట్రంలోనూ నేడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క సమస్యను పరిష్కారం చూపకుండా దాటవేయడం బాధాకరమని వారు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో పనిచేస్తున్న డలివేజీ వర్కర్లలో సుమారు 20 మంది మరణించినా వారి కుటుంబాలకు ప్రభుత్వ