Friday, 6 November 2026

ఫోటో రైటప్: చొప్పదండి లో మాట్లాడుతున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల

ఫోటో రైటప్: చొప్పదండి లో మాట్లాడుతున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల
తెలంగాణలో వైఎస్ఆర్ పథకాలు మళ్లీ ప్రవేశపెడతాం
వైయస్సార్ టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
చొప్పదండిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్ర
అర్నకొండ నుండి చొప్పదండి మీదుగా కొలిమికుంట వరకు సాగిన పాదయాత్ర
చొప్పదండిలో బహిరంగ సభ
చొప్పదండి, (జనం సాక్షి) నవంబర్ 14:
తెలంగాణ ప్రాంతంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని అమలు చేసి ఆచరణలో పెడతామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు.YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరిట చేస్తున్న పాదయాత్ర సోమవారం మండలంలోని ఆర్నకొండ చొప్పదండి మీదుగా కొలిమికుంట వరకు సాగింది. చొప్పదండిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు

 

-. ఈ చొప్పదండి నియోజక వర్గానికి వైఎస్సార్ ఎంతో చేశాడని

-. SRSP వరదల కాలువ వైఎస్ఆర్ కట్టించాడని

-. SRSP కెనాల్ ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని

– వైఎస్సార్ హయాంలో నారాయణ పూర్ రిజర్వాయర్ కట్టించారని

 

-. నారాయణ పూర్ బాధితులకు ఒక్క రూపాయి కూడా సహాయం అందించలేదని

-. ఇక్కడ jntu YSR కట్టించారని,మండలాలకు ఇంటర్ కాలేజీలు ఇచ్చారని గుర్తు చేశారు.
–

-. మోతే రిజర్వాయర్ కడతమని అన్నారు.. ఇంత వరకు లేదని
ఈ చొప్పదండి నియోజక వర్గం అల్లుడు కేసీఅర్… కేటీఆర్ మనవడు.. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లు
ముగ్గురు ఉన్నారు ఏమి లాభం అని

సిద్దిపేట,సిరిసిల్ల,గజ్వేల్ లా ఉంటది అని చెప్పారని
ఈ నియోజక వర్గానికి దిక్కు దివానా కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఅర్ భార్య సొంత ఊరు మిడ్ మానెర్ ముంపు గ్రామం అత్తగారు ఊరిని కూడా పట్టించుకోలేదు అంటే..ఇక రాష్ట్రాన్ని ఎలా పట్టించుకుంటారు అని అన్నారు.

*చొప్పదండి ఎన్నికలో నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అన్నాడని ,చిల్లిగవ్వ లేనొడు 3 ఏళ్లలో 100 ల కోట్లు ఎలా సంపాదించారని అన్నారు.

*సొంత గ్రామంలో 5 కోట్ల తో ఇంద్ర భవనం కట్టుకున్నాడనని,

*పద్మశాలి భూములు లాక్కొని కట్టుకున్నాడని,
ఎమ్మెల్యే కు ఉన్న పెద్ద పేరు కమీషన్ రాజ అని,

కమీషన్లు ఇవ్వనిది ఏ పని చేయరట అని ఆరోపించారు.

మున్సిపల్ చైర్మన్ పదవికి 90 లక్షలు… మార్కెటింగ్ చైర్మన్ అయితే 30 లక్షలు

ఎస్సై పదవికి 15 లక్షలు.. ci పదవికి 25 లక్షలు,
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్లు… ఈ ఎమ్మెల్యే కమీషన్ లు లేకుంటే ఏ పని చేయడట అని అన్నారు.భూ కబ్జాలు… ఇదే చొప్పదండి లో సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్ట్ కి కోట్ల రూపాయల కమీషన్ లతో జల్సా చేస్తున్నారు అని,
ప్రజలు ఓట్లు వేస్తే గెలిచాం అనే సోయి కూడా లేదని పేర్కొన్నారు.
ఈ ఎమ్మెల్యే దగ్గర 100 ల కోట్లు ఉన్నాయని అంటే అవన్నీ ప్రజల డబ్బులే కదా అని ప్రశ్నించారు .
– సీఎం దగ్గర నుంచి ఇలాంటి ఎమ్మెల్యే ల వరకు అంతా తినడమే అలవాటు గా మారిందని అన్నారు.
– ఓట్లు వేయించడం…వెళ్లి ఫామ్ హౌజ్ లో పడుకోవడం ఇదే తెలుసని అన్నారు.
-. డిగ్రీలు , పిజీలు చదివి రోడ్ల మీద తిరుగుతుంటే కేసీఅర్ లో చలనం లేదని విమర్శించారు.
. రుణమాఫీ ఇవ్వక బ్యాంక్ ల వద్ద రైతులను దొంగలు గా చూస్తే పట్టింపు లేదని అన్నారు.
వైఎస్సార్ పాలన రాష్ట్రంలో ఇప్పుడు లేదని వైఎస్సార్ పతాకాలు పూర్తిగా బ్రష్టు పట్టించారని ఆరోపించారు.
వైఎస్సార్ ఏ పథకం కూడా అమలు కావడం లేదని,
. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టాం అని,వైఎస్సార్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తా అని అన్నారు.