యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి న్యూస్ 05డిసెంబర్ 22 // టైటిల్ ;అధికారులను నిలదీసిన ప్రజాప్రతినిధులు.
ఫోటో రైట్ ఆఫ్01 తుర్కపల్లి సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు
తుర్కపల్లి మండల సమస్యలను పరిష్కరించని అధికారులను మండల ప్రజా ప్రతినిధులు సర్వసభ్య సమావేశంలో సోమవారం నిలదీశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరైన సభ్యులు తమ గ్రామాలలో సమస్యలను పరిష్కరించడం లేదని, సమస్యలు తీర్మానాలకే పరిమితం అవుతున్నాయని సభ్యులు అధ్యక్షురాలుకు విన్నపించుకున్నారు. మిషన్ భగీరథ అధికారులు నీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, నీటి లీకేజీల మరమ్మతులు చేపించడం లేదని ఆరోపించారు. ఇరిగేషన్ అధికారిని ఎలాంటి సమాచారం లేకుండా సమావేశానికి ఎందుకు హాజరయ్యారని ప్రజాప్రతినిధులు నిలదీశారు, ఇలాంటి అధికారిని సమావేశాలకు పిలివద్దని జిల్లా అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే అధికారులను పంపించేలా చూడాలని తీర్మానం చేశారు. గ్రామాలలో ఆశా వర్కర్ల, ఏఎన్ఎంలు గర్భిణీ స్త్రీలకు తగు సూచనలు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయ్యేలా చూడాలని ప్రాథమిక డాక్టర్ సుధీర్ రెడ్డికి సూచించారు. గ్రామాలలో ఉన్న ఆర్ అండ్ బి రోడ్లు దయనీయంగా ఉన్నాయని, ప్రణాళిక ప్రకారం నివేదికలు తయారుచేసి రోడ్లు మరమ్మత్తు పనులు జరిగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బికు నాయక్, ఎంపీడీవో ఉమాదేవి, తాసిల్దార్ బ్రహ్మయ్య, వైస్ ఎంపీపీ మహదేవుని శ్రీనివాస్, ఎంపీటీసీలు పలుగుల నవీన్ కుమార్, కానుగంటి శ్రీనివాస్ యాదవ్, ప్రతిభ రాజేష్, బో రెడ్డి వనజ హనుమంత్ రెడ్డి, మోహన్ బాబు, సర్పంచులు పడాల వనిత శ్రీనివాస్, వాణి అమరేందర్ రెడ్డి, ఇమ్మడి మల్లప్ప , శ్రీనువాస్ రెడ్డి,, రమేష్, మండల అధికారులు, ఎంపీ ఓ శ్రీమాలిని, సూపర్ండెంట్ ఇన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ ఆఫ్01 తుర్కపల్లి సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు




