Wednesday, 4 November 2026

ఘనంగా ప్రపంచ మృతిక దినోత్సవ వేడుకలు

ఘనంగా ప్రపంచ మృతిక దినోత్సవ వేడుకలు

ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా వ్యవసాయ అధికారిని ఉషా దయాల్

జనం సాక్షి,చెన్నరావు పేట

ప్రపంచ మృతిక దినోత్సవ సందర్భంగా మండలంలోని నాలుగు రైతువేదికలలో రైతులకు భూసారం విలువపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ అధికారిని ఉషా దయాల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డి ఏ ఓ ఉషా దయాల్ మాట్లాడుతూ రైతులు ప్రతి రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా భూమి యొక్క పరీక్ష చేయించుకోవాలన్నారు.ఈ యొక్క పరీక్ష ద్వారా భూమిలో మొక్కకు అందుబాటులో ఉండే మూలకాలు ఎంత మేరకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడంతో పాటు ఈ రకమైన ఎరువులను ఎంత మోతాదులో వాడాలి అనేది కూడా రైతులకు అవగాహన రావడం జరుగుతుంది. దానివలన రైతులు రసాయనిక ఎరువులను తగ్గించడంతోపాటు ఎరువులను సమగ్రంగా సమతుల్యంగా వాడడం జరుగుతుంది దీని ద్వారా రైతులకు పెట్టుబడిని తగ్గించడంతోపాటు భూమి యొక్క సారాన్ని కాపాడడం వల్ల అవుతారు కాబట్టి రైతులు తప్పక భూసార పరిసరాలు చేయించుకోవాలని అన్నారు అంతేకాకుండా భూమిలో ఉన్న భాస్వరాన్ని వాడడం కోసం డిఏపి వాడకాన్ని తగ్గించి దాని స్థానంలో పీ ఎస్ బీ ని వాడడం ద్వారా భూసారంలో మిగిలి ఉన్న భాస్వరాన్ని ఈ పీ ఎస్ బీ మొక్కకు అందే విధంగా తోడ్పడుతుంది. కాబట్టి భూమిలో మిగిలి ఉన్న భాస్వరాన్ని వాడుకోవడం తో పాటు పైపాటుగా వాడే మోతాదు తగ్గుతుంది. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి పాల్గొని రైతులందరూ వ్యవసాయ శాఖ అందిస్తున్న సలహాలను సూచనలను పాటించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులను పొందాలని అన్నారుు.ఈ మట్టి పరీక్షలను క్రమం తప్పకుండా రైతులు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పి కోఆప్షన్ రఫీీ, మండల కో ఆప్షన్ గఫర్,ఆర్ఏఆర్ఎస్ సైంటిస్ట్ వీరన్న ఎన్ఎఫ్ఎంఎన్ కన్సల్టెంట్ సారంగం, రైతుబంధు సమితి విలేజ్ కోఆర్డినేటర్లు బాలు, మండలం మెంబర్స్ విలేజ్ మెంబర్స్ తో పాటు ఎఫ్పీఓ సభ్యులు, డీలర్స్, రైతులు మహేందర్ రెడ్డి, అడప సత్తయ్య, రాజిరెడ్డి, ఆయిల్ రెడ్డి, కొమురయ్య, దేవి సింగ్ డీలర్స్ ,సుభాన్, సూరయ్య సంతోష్ ,సురేష్, రామకృష్ణ తో పాటు కేజీపీ కేజీవీబీ విద్యార్థులు పాల్గొని ర్యాలీ నిర్వహించడం జరిగింది.