Wednesday, 4 November 2026

ఫోన్ ట్యాపింగ్ లపై పక్కా సమాచారం ఉంది:మంత్రి యనమల

హైదరాబాద్:సీఎం చంద్రబాబునాయుడు ఫోన్ ట్యాపింగ్ దారణమని, ఫోన్ ట్యాపింగ్ పై మాకు పక్కా సమాచారం ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఢిల్లీలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్లో గవర్నర్ అధికారాలు అమలు కావడంలేదన్నారు. ఈ అంశాలన్నింటిని ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు వివరిస్తామని చెప్పారు. విభజన సమస్యల పరిష్కారానికి మేము ముందుకు వచ్చినా, తెలంగాణ సర్కారు సహకరించడం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *