హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు, బ్రదర్ అనిల్‌కుమార్‌కు మధ్య సంబంధాలున్నాయని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ కుట్రలో జగన్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. తెలంగాణలో ప్రముఖ నాయకులు, ఉద్యమ నాయకుల ఫోన్‌లను ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. తమ నేత చంద్రబాబుకు ప్రాణహాని ఉందని వారు ఒక్క అడుగు ముందుకేస్తే మేం వంద అడుగులు ముందుకేస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.




