ఫోరిడాపై విరుచుకుపడనున్న ఇర్మా

విదేశాల్లో భారీతీయల కోసం హెల్ప్‌లైన్లు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): హరికేన్‌ ‘ఇర్మా’ కరేబియన్‌ దీవుల్లో భయోత్పాతం సృష్టించి ఫ్లోరిడాపై విరుచుకుపడుతుండటంతో భారత విదేశాంగ శాఖ శనివారం స్పందించింది. అమెరికాతో పాటు ఇతర

దేశాల్లోని భారతీయుల క్షేమ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు తెలిపారు. ఇర్మా ప్రబావం అమెరికా, వెనిజులా, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌లో పెను ప్రభావాన్ని చూపిస్తోందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్‌ వరుస ట్వీట్లతో తెలిపారు. నాలుగు దేశాల్లోని స్థానిక ప్రభుత్వాలు, భారత దౌత్య కార్యాలయాలతో ఎప్పటికప్పుడు మాట్లాతున్నామన్నారు. పరిస్థితిని సవిూక్షించడంతో పాటు అక్కడి భారతీయులకు అవసరమైన సహాయ సహకారాలను అందజేయాలని కూడా తెలియజేసినట్టు చెప్పారు. భారతీయులు అవసరమైన సహాయాన్ని పొందేందుకు వీలుగా అక్కడి దౌత్య కార్యాలయాల హెల్ప్‌లైన్‌ నెంబర్లను కూడా ఆయన ట్విటర్‌ ద్వారా తెలిపారు. హరికేన్‌ విలయం ధాటికి ఇంతవరకూ 19 మంది ప్రాణాలు కోల్పోగా, లెక్కకు మిక్కిలిగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 12 లక్షల మందికి పైగా హరికేన్‌ ముంపు బారిన పడ్డారు. ఇదిలావుంటే రెండురోజులుగా ఇర్మా, హరికేన్‌ ధాటికి అమెరికా విలవిలలాడుతున్నది. కుండపోత వర్షం, మరోవైపు భీకరమైన రాక్షస గాలులు కరీబియన్‌ దీవుల్లో విధ్వంసం సృష్టించాయి. 295 కిలోవిూటర్ల వేగంతో పెనుగాలు పెద్ద పెద్ద వృక్షాలను కూకటి వేళ్లతో పెకిలించే స్తున్నాయి. కరీబియన్‌ దీవుల నుంచి ఇర్మా ఎ/-లోరిడా వైపు కదులుతున్నట్లు అమెరికా జాతీయ హరికేన్‌ కేంద్రం తెలిపింది. కరీబియన్‌ దీవుల్లో కేటగిరి 5 గా ఉన్న ఇర్మా ఫ్లోరిడా వైపు కుదులుతూ కేటగిరి 4గా మారి గంటకు 250 కి.విూల వేగంతో గాలులు విస్తాయని హెచ్చరించింది. మెక్సికో లో భూకంపం.. హరికేన్‌, ఇర్మా రెండు ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్టాల్రను వణికిస్తున్నాయి. గురువారం మెక్సికో తీరంలో 8.2 తీవ్రతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. టొబాస్కో, ఒక్సాకా, చైపాస్‌ రాష్టాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఈ రాష్టాల్లో శిథిలాలను తొలిగించే పక్రియలో అధికారులు ఉన్నారు. ఇంకా అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. భూకంపం వల్ల కనీసం 200 మంది గాయపడి ఉంటారని అధ్యక్షుడు ఎన్రిక్‌ నీటో తెలిపారు. ఈ ప్రాంతంలో 8.2 తీవ్రతతో భూకంపం రావడం ఈ శతాబ్దంలోనే అత్యంత శక్తివంతమైనగా భావిస్తున్నారు. ఒక్క ఒక్సాకా రాష్ట్రంలోనే 45 మంది చనిపోయారు. చైపాస్‌లో మరో 12 మంది చనిపోయారు. మొత్తం ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 61 కి చేరుకున్నది. ఇక.. కరీబియన్‌ దీవులను దారుణంగా దెబ్బతీసిన హరికేన్‌ ఇర్మా ఇప్పుడు క్యూబాపై విరుచుకుపడింది. దీంతో అక్కడ అత్యంత బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కూడా నమోదు అయ్యాయి. అర్చిపెలాగో దీవిపైన కూడా ఇర్మా ప్రభావం చూపింది. అయితే ఇర్మా ట్రాక్‌ తప్పడంతో బహమాస్‌ దాదాపు భారీ విపత్తు నుంచి బయటపడింది. మరోవైపు అమెరికాలోని ఎ/-లోరిడాపై ఇర్మా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. సుమారు 60 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ ఆదేశించారు. ఇర్మా వల్ల కరీబియన్‌ దీవుల్లో సుమారు 20 మంది మృతిచెందినట్లు అంచనా వేస్తున్నారు. దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత అయిదవ ప్రమాద హెచ్చరిక కలిగిన హరికేన్‌ క్యూబాను తాకుతున్నది. ఇర్మా వల్ల గంటలకు 257 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. క్యూబాలోని కైబేరియన్‌ పట్టణానికి 190 కిలోవిూటర్ల దూరంలో ఇర్మా కేంద్రీకృతమైనట్లు తెలుస్తున్నది. ఒక వేళ ఇది తీరం దాటితే పెను విధ్వంసం రావడం ఖాయమని నాసా హెచ్చరించింది. ఇర్మా కదలికలను రికార్డును చేసిన నాసా శాస్త్రవేత్తలు.. ఫ్లొరిడా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో సముద్రంలో హరికేన్‌ ఇర్మా కదలికలను నాసా రికార్డు చేసింది.