నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ హైదరాబాద్ లోగల నల్లకుంట, దిల్ సుఖ్ నగర్ ఆధ్వర్యంలో పలుకో ర్సులకు దరఖాస్తులు చేసుకోవచ్చునని ఎన్ఐఎఫ్ డీ సంస్థ డైరక్టర్ రాము యాదవ్ పేర్కొన్నారు… బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రం లో మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వృత్తి విద్యా కోర్సులు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు… ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ ఫోటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి వృత్తి విద్యా డిప్లమో, డిగ్రీ, అడ్వాన్స్ డిప్లొమో, పీజీ డిప్లమో కోర్సులలో చేరుట కోసం ఆర్థికంగా వెనుకబడిన వారికి మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా ఫీజులో రాయితీ పొందొచ్చనన్నారు.. ప్రస్తుత తరుణంలో వృత్తివిద్యా కోర్సులు ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు.. ఈ అవకాశాలని నిరుద్యోగ యువత వినియోగించుకోవాన్నారు..జూన్ 24 తారీకు వరకు చేసుకోవచ్చని, జూన్ 25వ తేదీన స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. టెన్త్ ఇంటర్ డిగ్రీ మరియు పీజీ లతో విద్యార్హతలు కలిగి ఉంటే చాలనన్నారు.. నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలు చెందిన నిరుద్యోగ యువత బాసట గా నిలవడమే తమ లక్ష్య మన్నారు… ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుని తమ భవిష్యత్ కు బంగారు బాట వేసుకోవాలని కోరారు. మిగతా వివరాల కోసం ఆన్ లైన్ లో www.nifdindia.in సందర్శించ వచ్చునన్నారు..9030610033 / 9030610055 ఫోన్ నెంబర్ల లలో సంప్రదించ వచ్చునన్నారు
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు కు దరఖాస్తులు చేసుకోవాలి .. 25న స్కాలర్ షిప్ మెరిట్ పరీక్ష … – ఎన్ఐఎఫ్ డీ డైరెక్టర్ రాము యాదవ్




