Wednesday, 4 November 2026

తెలంగాణే దేశానికి రోల్ మోడల్ – ఘనంగా నియోజకవర్గ సాగునీటి దినోత్సవ వేడుకలు

హుజూర్ నగర్ జూన్ 7 (జనంసాక్షి): తెలంగాణే దేశానికి రోల్ మోడల్ అవుతుందని హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు నిండి పదవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సూచనలు, ఆదేశాల మేరకు జూన్ 2 నుండి 22 వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా పార్క్ నుండి భారీ ర్యాలీతో బయలుదేరి ముత్యాలమ్మ గుడి, శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నియోజకవర్గ స్థాయి సాగునీటి దినోత్సవంలోఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ అమరుల ఆశయాల కనుగునంగా తెలంగాణను తీసుకురావడం జరిగిందని, ఈ తొమ్మిది సంవత్సరాలలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వినూత్న పథకాలు అమలు చేస్తూ అన్ని రంగాలలో రాష్ట్రం అధ్భుత ప్రగతి సాధించి అగ్ర భాగాన నిలిచిందని అన్నారు. తెలంగాణ తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను,ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలియజెప్పేలా ఉత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందరి సహకారంతో భాగస్వామ్యులను గ్రామ, పట్టణ స్థాయిలో చేస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. సాధించిన తెలంగాణ రాష్ట్రం తొమ్మిది సంవత్సరాల కాలంలో కేసీఆర్ అధ్భుత పరిపాలనతో రాష్ట్రం అనేక రంగాల్లో విజయాలు సాధించి మంచి పరిపాలన దక్షుడు విమర్శకుల ప్రశంసలు పొందారని అన్నారు. వ్యవసాయ రంగంలో రైతాంగానికి విశ్వాసం కలిగించారని, కాకతీయుల కాలంలో వ్యవసాయ రంగంలో వెలుగొందిన జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో 70సంవత్సరాలుగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకు పోయింది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగంలో ఎక్కువ లాభ పడిన జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా అని తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసిన ఉమ్మడి జిల్లా గత 4 సం.లుగా 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసి దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగిందని అన్నారు. తొమ్మిది ఏళ్లలో అన్ని రంగాలలో నియోజకవర్గంలో ఎంతో ప్రగతిని సాధించడం జరిగిందని, ఉపాధితో పాటు, ఉద్యోగం, వ్యవసాయం, వైద్యంలో, శాంతిభద్రతలు, వ్యవసాయం ఇలా ఒకటేమిటి అన్నిరంగాలు అభివృద్ధిలో ముందున్నాయని, 2014 కు పూర్వం తెలంగాణ, 2014 తర్వాత తెలంగాణను కళ్లకు కట్టినట్టుగా ప్రజలందరికీ తెలియజేపే బాధ్యత ప్రజాప్రతినిధులతో పాటు, అధికారులందరిపై ఉందన్నారు. ఉత్సవాలలో భాగంగా రోజువారి నిర్వహించే నియోజకవర్గ సాగునీటి స్థాయి కార్యక్రమాలపై పలు సూచనలు చేస్తూ ఉత్సవాలను అధికారులు తమదిగా తీసుకొని నిర్వహించాలని, అన్ని కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులను, రైతాంగంను, ప్రజలను భాగస్వామ్యం చేయాలని, సంబంధిత ప్రజాప్రతినిధుల సమ్మతితో, అందరినీ భాగస్వామ్యులను చేస్తూ కార్యక్రమాలను నిర్వహించాలని, అన్ని శాఖలు గత తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతిని నివేదికల రూపంలో తయారు చేశారని, ఈ సమాచారం మొత్తం ప్రజాప్రతినిధులందరికీ సమర్పించాలని ఆదేశించారు. తెలంగాణ రైతు దినోత్సవం మొదలుకొని జూన్ 22 న నిర్వహించే అన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని, తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా కవులను, సత్కరించాలని, తెలంగాణ గిరిజన ఉత్సవం సందర్భంగా గిరిజనులను పిలిచి కార్యక్రమాలు నియోజకవర్గ, జిల్లా స్థాయిలో నిర్వహించాలని అన్నారు. తెలంగాణ మంచినీళ్ల పండుగ సందర్భంగా అన్ని వాటర్ ట్యాంకుల వద్ద గతంలో నీటి కోసం మహిళలు పడిన ఇబ్బందులు, ప్రస్తుత పరిస్థితి పై నాడు- నేడు ఫోటోలతో సహా తెలియజేసే ప్రయత్నం చేయాలని, మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ప్లోరో సిస్ సమూలంగా నిర్మూలించామని, ఇది గొప్ప విజయమని, ప్లెక్సీ లు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ ప్రగతిని వివరించేలా ఏర్పాటు ను సూచించారు. ప్రతి శాఖ ఉత్సవాలను ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఉత్సవాల నిర్వహించాల్సిందిగా కోరారు. ప్రతి శాఖ ద్వారా నాడు -నేడు పరిస్థితిని ఫోటోల ద్వారా వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లీ అర్చనరవి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మఠంపల్లి ఎంపీపీ పార్వతి కొండా నాయక్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు దొంతి రెడ్డి పద్మ, అప్పిరెడ్డి, రంగాచారి కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, పలుశాఖల అధికారులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిలు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.