Tuesday, 3 November 2026

ఫ్రెండ్లీ పోలీస్ ఆద్వర్యంలో మాదకద్రవ్యాల పై కేజీబీవీలో అవగాహన

 ముప్కాల్ (జనం సాక్షి) జూన్ 26 ఫ్రెండ్లీ పోలీస్ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మారకద్రవ్యాల వ్యతిరేక మరియు అక్రమ రవాణాదినోత్సవాన్ని మత్తు పదార్థాలపై అవగాహనను అవి వాడడం వల్ల కలిగే అనర్థాలను గురించి వివరించారు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను మరియు మంచి అవగాహన ను కేజీబీవీ ముప్కాల్ పాఠశాలలో కల్పించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్టిక్ సెక్రెటరీ సాగర్ రెడ్డి , మండల్ ప్రెసిడెంట్ విక్రమ్ , కన్వీనర్ చాకులింగం, మరియు లయన్స్ క్లబ్ సభ్యులు కనకయ్య ముప్కాల్ ఎస్. ఐ .శ్రీ భాస్కరాచారి ,ఏ.ఎస్.ఐ తొగర్ల సురేష్ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ వినోద మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిలకు వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ పోటీలలో పాల్గొని గెలుపొందిన విద్యార్థినిలకు బహుమతులను ప్రధానం చేయడం జరిగింది.