Tuesday, 3 November 2026

రైలు ప్రమాద బాధితునికి హెల్పింగ్ హ్యాండ్స్ రూ. 1,55,150 సాయం

జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన పందిల్ల సుమన్ కి రైలు ప్రమాదంలో రెండు కాళ్లు పూర్తిగా పోయినవి.నిరుపేద కుటుంబానికి చెందిన తన ఆర్థిక పరిస్థితి చూసి, తన జీవితానికి ఒక నమ్మకాన్ని కల్పిస్తూ మేమున్నాం అంటూ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులంతా కలిసి జమ చేసిన రూపాయలు 1,55,150/-, భాడితునికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సోమవారం అతనికి ఫిక్స్డ్ డిపాజిట్ అందజేశారు.