జనం సాక్షి , మంథని: పెద్దపల్లి జిల్లా మంథని ఫ్రెండ్స్ క్లబ్ నూతన అధ్యక్షునిగా పోరెడ్డి గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మిర్యాల ప్రసాద్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఫ్రెండ్స్ క్లబ్ లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా ఏ. గంగాధర్, రాంపల్లి చంద్రమౌళి వ్యవహరించారు. నూతన ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడిగా పోరెడ్డి గోపాల్ రెడ్డి , ఉపాధ్యక్షుడిగా సువర్ణ గణపతి, కార్యదర్శిగా మిరియాల ప్రసాద్ రావు, సంయుక్త కార్యదర్శిగా మల్క గోపాల్ రావు, భీముని వెంకటస్వామి, ట్రెజరర్ గా బెల్లంకొండ రవీందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా ఆకుల రాజబాబు, పుట్ట ముఖేష్ , పెండ్లి ప్రభాకర్ రెడ్డి, కట్టెకోల సదానందం,
గుండా పాపారావులను ఎన్నుకున్నారు.




