హైదరాబాద్, మార్చి 17: ‘బంగారు తల్లి’ పథకాన్ని తెలంగాణ సర్కార్ కొనసాగిస్తుందా? లేదా? అని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. పథకం అమలు రాష్ట్రంలో ఎక్కడా కనిపించట్లేదన్నారు. ఆసరా పథకంలోనూ చాలా లోపాలున్నాయని, అంగన్‌వాడీలకు సన్నబియ్యం సరఫరా చేయట్లేదని ఆయన ఆరోపించారు. అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని, సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో వాస్తవంగా రావాల్సిన రాష్ట్ర వాటాను సాధించుకుకోవాలని జీవన్‌రెడ్డి సర్కార్‌కు సూచించారు.




