హైదరాబాద్, మార్చి 17: అసెంబ్లీలో విపక్షాలు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానాలు ఇచ్చారు. తెలంగాణలో కరువు మండలాల వివరాలు సేకరిస్తామని, తాగునీటి కోసం జిల్లాలకు రూ.263 కోట్లు విడుదల చేశామని చెప్పారు.
డబుల్ బెడ్‌రూమ్ హామీపై వెనక్కి తగ్గం…
ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై సీఐడీ నివేదిక తయారవుతోందని, దుర్వినియోగానికి పాల్పడినవారి నుంచి తిరిగి డబ్బు వసూలు చేస్తామని చెప్పారు. అంగన్‌వాడీలకు సన్నబియ్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా సీలేరు విద్యుత్‌పై తెలంగాణ వాటా కోసం అన్ని పార్టీలతో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు.
వక్ఫ్‌భూములు అన్యాక్రాంతం…
వక్ఫ్‌భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయని కే సీఆర్ తెలిపారు. గత బడ్జెట్‌లో భూముల అమ్మకం ద్వారా రూ.6,500 కోట్లు వస్తుందని ఆశించామని, రియల్‌బూమ్ లేకపోవడంతో భూములు అమ్మలేదని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ 10 వేల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని తెలిపారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఈఆర్సీ దగ్గర ఉన్నాయని చెప్పారు.
లెక్కల్లో పొంతన లేదు: జానారెడ్డి
బడ్జెట్‌లో ప్రతిపాదించినదానికి, వచ్చే ఆదాయానికి పొంతన ఏ విధంగా ఉంటుందో సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని అసెంబ్లీ విపక్ష నేత జానారెడ్డి డిమాండ్ చేశారు.
హామీల పై వెనక్కి తగ్గం : సీఎం కేసీఆర్




