Friday, 6 November 2026

బంగారు తెలంగాణ సాధిస్తారా?

బంగారు తెలంగాణ సాధిస్తారా?
 నిజామాబాద్: సారా తెలంగాణగా మార్చకుండా, విద్యుత్ భారం పడకుండా బంగారు తెలంగాణ సాధిస్తారా అని కేసీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సూటిగా ప్రశ్నించారు. గురువారం నిజామాబాద్లో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… బుధవారం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ ఊహల పల్లకిలో ఉందని ఎద్దేవా చేశారు.

మంచి కథనాలు రాస్తే విలేకరులకు మంత్రి హరీష్రావు బహుమతులు ఇస్తానన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగే అవకతవకలు బయటపెడితే తమ పార్టీ రూ. లక్ష ఇస్తుందని పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *