హైదరాబాద్,ఏప్రిల్2(జనంసాక్షి): నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న బంగారు వ్యాపారులు గత నెలరోజులుగా చేస్తున్న ఆందోళన న్యాయబద్దమైందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు అన్నారు. సికింద్రాబాద్ పాఠ్ మార్కెట్లో ఆందోళన చేస్తున్న బంగారు వ్యాపారులకు మంత్రి మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఒక్కశాతం ఎక్సైజ్ సుంకం వెనక్కి తీసుకోవాలని కోరారు. ఎక్సైజ్ సుంకం వల్ల వ్యాపారులకు తీవ్ర నష్టం జరుగుతందన్నారు. సికింద్రాబాద్ పాఠ్మార్కెట్ నుంచి సర్దార్ పటేల్రోడ్డు విూదుగా ప్యారడైజ్ నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరకు దాదాపు 2వేల మంది బంగారు వ్యాపారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.




