Tuesday, 3 November 2026

పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో మోసం: భట్టి

e4a3nfntహైదరాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అంతా వాస్తవమే అయితే…ప్రతిపక్షాల ప్రజెంటేషన్‌కు  ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని  టీ-పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కావాలనే విపక్షాలకు ఛాన్స్‌ లేకుండా కేవలం అధికార పక్షమే ప్రజెంటేషన్‌ ఇచ్చేలా సిఎం కార్యక్రామ్ని పెట్టారని అన్నారు. విపక్షాలు కూర్చుని కేవలం ఆమోదించడానికే అనుమతి ఇచ్చేలా చేశారని విమర్శించారు.

హైదరాబాద్‌లో  శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ…. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చేనాటికి 96 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులున్నాయన్నారు. కాంగ్రెస్‌ హయాంలో జలయజ్ఞంలో భాగంగా 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయన్న విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో లక్షా 50 వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేసే కుట్రలో భాగస్వామి కాకూడదనే కేసీఆర్‌ ప్రజెంటేషన్‌కు  కాంగ్రెస్‌ పార్టీ దూరంగా ఉందని భట్టి చెప్పారు.

తెలంగాణలో కరవు తాండివిస్తోందని , ఇప్పడున్న మండలాలు కాకుండా అన్ని మండలాలను కరవు ప్రాంతాలుగా గుర్తించాలని మల్లు భట్టి విక్రమార్క సూచించారు.. కోట్లు కొల్లగొట్టేందుకు ప్రాజెక్టుల రీ డిజైన్‌ అని ఆయన వ్యాఖ్యానించారు.. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చి సభలో ఆమోదింపజేసేందేకు సీఎం కుట్రచేశారన్నారు.. లోపాలనను చూపించే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు లేఖ రాసినట్లు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.. సీఎం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను ప్రజలకు వివరిస్తామన్నారు.. ఇదిలావుంటే

జలవిధానం, ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై  అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ చాలా బాగుందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దాన్ని ఆచరణలోకి తీసుకొస్తే ఇంకా బాగుంటుందని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ… డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు  హైదరాబాద్‌లో  లక్షతోపాటు గ్రామానికో 50 ఇళ్లు నిర్మిస్తే… కేసీఆర్‌కు ఓటు వేయమని… తానే చెబుతానని కోమటిరెడ్డి తెలిపారు. అయితే ఇది జరిగే పనేనా అని పెదవి విరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *