బండి యాత్ర పై రాళ్ల దాడి

 

* కెసిఆర్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

* తాటాకు చప్పుల్లకు భయపడం

* రాళ్ల దాడి టిఆర్ఎస్ గుండాయిజానికి నిదర్శనం

* బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర -3 పై టిఆర్ఎస్ రాళ్ల దాడి చేయడంపై కరీంనగర్ బిజెపి శ్రేణులు భగ్గుమన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రపై టిఆర్ఎస్ గుండాల రాళ్ల దాడిని ఖండిస్తూ బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కెసిఆర్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల పెళ్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర పై టీఆర్ఎస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాళ్లదాడి టిఆర్ఎస్ గుండాయిజం రాజకీయానికి నిదర్శనం లాంటిదని , స్వాతంత్రం రోజునే హింసా మార్గాన్ని ఎంచుకున్న టిఆర్ఎస్ సంస్కృతిని తెలంగాణ సమాజం మొత్తం గ్రహించిందన్నారు. ముఖ్యంగా ప్రజల్లో బీజేపీ కి వస్తున్న ఆదరణ స్పందన చూసి తట్టుకోలేక అసహనంతో చేస్తున్న దాడులే ఇవన్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు భద్రత కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ కి కొమ్ముకాస్తూ దాడులకు పరోక్షంగా సహకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. టిఆర్ఎస్ తాటాకు చప్పులకు భయపడేది లేదని , దీటుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం బిజెపికి ఉందని, తెలంగాణలో బిజెపి శక్తిని తక్కువగా అంచనా వేయవద్దని కెసిఆర్ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.దాడులు చేసిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఇలాంటి చర్యలు పునవృతం కాకుండా చూడాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ప్రభాకర్ యాదవ్, సాయిని మల్లేశం, జిల్లా అధికార ప్రతినిధులు సిద్ధి సంపత్, సుధాకర్ పటేల్, మీడియా సెల్ కన్వీనర్ కటకం లోకేష్, బండ రమణారెడ్డి, దుబాల శ్రీనివాస్, కచ్చు రవి కార్పొరేటర్ ,యెన్నం ప్రకాష్ ,పిట్టల మధు , జమాల్, బల్బీర్ సింగ్, బండారి గాయత్రి,మంథని కిరణ్, వరాల జ్యోతి, ఊరడి శివారెడ్డి, జోన్ అధ్యక్షులు నాగసముద్రం ప్రవీణ్, నరహరి లక్ష్మారెడ్డి, పాదం శివరాజ్, ఆవుదుర్తి శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, ఎడమ సత్యనారాయణ రెడ్డి, రెడ్డి శ్రీనివాస్, మామిడి చైతన్య రమేష్, పొన్నం ముండయ్య కలికోట మోహన్ టవర్ వెంకటేష్ ,కైలాస నవీన్, కూకట్ల రమేష్, గుండా అరుణ నరేంద్ర సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.