Wednesday, 4 November 2026

బండి యాత్ర విజయవంతం కావాలి

బండి యాత్ర విజయవంతం కావాలి…

– సభ విజయవంతం చేయడానికి బోస్లే మోహన్ రావ్ పాటిల్ ముమ్మర కసరత్తులు…

– తాలూకా వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు.

జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 22

బండిసంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రహయాత్ర ఈ నెల 28 తేదిన ముధోల్ నియోజకవర్గ0 బై0సా నుండి ప్రారంభము కానున్న సందర్భంగా సంగ్రామ యాత్రను విజయవంతం చేసేందుకు గాను ఆ పార్టీ ప్రతినిధి బోస్లె మోహన్ రావు పాటిల్ ముమ్మర కసరత్తులు చేపడుతున్నారు. రెండు రోజులుగా అలుపెరుగని రీతిలో అవిశ్రాంతంగా ప్రజా సంగ్రామ యాత్రకు కోసం ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం కుంటాల మండలంలో సుడిగాలి పర్యటనలు చేపట్టిన ఆయన మంగళవారం లోకేశ్వరం మండలంలో అదే తరహాలో పర్యటనను చేపట్టారు. గ్రామ గ్రామానికి బీజేపీ దండుతో కలిసి వెళ్లి ఆయా గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నాడు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరుపుతూ ఆయా గ్రామాల్లో పార్టీ స్థితిగతులు, పటిష్టతకు అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు బీజేపీ బలోపేతం తదితర అంశాలపై కూలంకశంగా చర్చిస్తున్నారు. గ్రూప్ విబేదాలకు తావులేకుండా, వర్గ పోరుకు అస్కారం లేకుండా పార్టీ శ్రేణులన్నీంటితో మమేకమవుతూ పర్యటనను కొనసాగిస్తున్నారు. బోస్తే మోహన్రావ్ పాటిల్ అనుసరిస్తున్న తీరుతో పలు గ్రామాల్లో ఇన్నాళ్ల పాటు స్తబ్ధుగా వ్యవహరిస్తూ వచ్చిన పార్టీ శ్రేణుల్లో కదలికలు మొదలయ్యాయి.