Wednesday, 4 November 2026

కాంగ్రెస్ పార్టీలో పలువురు మైనార్టీ నాయకుల చేరిక.

కాంగ్రెస్ పార్టీలో పలువురు మైనార్టీ నాయకుల చేరిక.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 22. (జనంసాక్షి) సిరిసిల్లలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సెస్ ఎన్నికల సన్నాహక సమావేశం సందర్భంగా మంగళవారం సిరిసిల్ల పట్టణానికి చెందిన పలువురు మైనార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డిసిసి అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ముందు వరుసలో ఉండి పోరాడాలని కోరారు. కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గం ఇంచార్జ్ ఆది శ్రీనివాస్. కుస రవీందర్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు తదితరులు ఉన్నారు.