Tuesday, 3 November 2026

బండి సంజయ్ అరెస్టుపై బిజెపి నాయకులు ఆగ్రహం

 

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధనికి  యత్నం_అడ్డుకున్న పోలీసులు. రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 5. (జనంసాక్షి). భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుపై బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బిజెపి నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉదేశపూర్వకంగానే బండి సంజయ్ పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు తో చెలగాటమాడుతున్న ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో ఎనగంటి నరేష్ అనిల్ గౌడ్ రామకృష్ణ గాజుల సదానందం కోడం శ్రీనివాస్ మల్లేశం రాజు తదితరులు పాల్గొన్నారు.