కొండమల్లేపల్లి ఏప్రిల్ 5 జనంసాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రం గుమ్మడవల్లి గ్రామంలో బుధవారం నాడు ప్రజల వద్దకు ఆర్టీసీ సేవలు కార్యక్రమం నిర్వహించారు ప్రజలందరూ ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని, ప్రజల వద్దకు ఆఫీసు సేవలు వస్తున్నాయని దేవరకొండ ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ భారతి భాయి గ్రామ ప్రజలకు సూచించారు గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రజల వద్దకు ఆర్టీసీ సేవలు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూప్రజల కోసం ఆర్టీసీ సురక్షిత మైన, సుఖవంతమన ప్రయాణాన్ని అందిస్తుందని తెలిపారు ఆర్టీసీ అందిస్తున్న పథకాలు, రాయితీల గురించి వివరించారు. ఆటోలో, ప్రైవేటు వాహనాలలో ప్రయాణించకుండా, ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని పేర్కొన్నారు ప్రజలు ఆర్టీసీకి తమ యొక్క సలహాలు, సూచనలు తెలపాలని సూచించారు ప్రయాణికుల కోసం ఆర్టీసీ అన్ని రకాల సేవలను అందిస్తుందని గ్రామాల్లో ప్రజలు నిర్వహించే వివాహ వేడుకలకు శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులను అద్దకిరాయికి ఇవ్వబడునని అన్నారు మారుమూల గ్రామాలకు కూడా బడి పిల్లలు ప్రజల కోసం స్పెషల్ ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని ప్రజలకు అవగాహన కలిగించారు ప్రతి ప్రయాణికుడు కూడా ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేయాలని వారికి ఆర్టీసీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారి ఎన్.వి నారాయణ, సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్, ఉప సర్పంచ్ ముక్కమల్ల రాజలింగం, మాజీ సర్పంచ్ బోడ యాదయ్య యాదవ్, మాజీ ఎంపీటీసీ బోడ సత్తయ్య యాదవ్, ఆర్టీసీ డ్రైవర్ బోడ హనుమంతు, యాదగిరాచారి, బోడ నర్సింహ, రాము, శేఖర్, గిరి, యాదయ్య, అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు




