బెల్లంపల్లి, మార్చ్ 11, (జనంసాక్షి )
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను శనివారం బీఆరెస్ పార్టీ అధ్యర్యంలో బెల్లంపల్లి కాంట చౌరస్తాలో దహనం చేశారు. భారత జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాదు ఎమ్మెల్సి కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసినట్లు బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా – శ్రీధర్ తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ అనే గౌరవం లేకుండా ఇష్టానుసారం అవాకులు చవాకులు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్సి కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే బీఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా లోకం తరపున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేసిన బండి సంజయ్ ను తెలంగాణలో తిరుగకుండా చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్లు గెల్లి రాజలింగు, సముద్రాల లావణ్య, పోతురాజు లీల, అస్మా షేక్, గురుండ్ల లక్ష్మి, సరిత, సుజాత, కో అప్షన్ సభ్యురాలు మేరీ సుశీల, పట్టణ మహిళా అధ్యక్షురాలు సత్యవతి, నాయకులు బడికెల శ్రావణ్, విజయ్, అన్వర్, శ్యామ్, యునుస్, మౌనిక్ తదితరులు పాల్గొన్నారు.
బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం.




