Tuesday, 3 November 2026

స్పీకర్ ని కలిసిన పలు కులసంఘాల ప్రతినిధులు.

 

కోటగిరి మార్చి 11 జనం సాక్షి:-బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండల కేంద్రాని కి చెందిన కుమ్మరి,కుర్మ,గాండ్ల, కమ్మరి కులసంఘాల ప్రతి నిధు లు శనివారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కులసంఘాల ప్రతినిధులు స్పీకర్ కు శాలువ తో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. గతంలో కుమ్మరి,కుర్మ,గాండ్ల సంఘాల అభివృద్ధికి జరిగిన పనుల విషయమై కుల ప్రతి నిధులతో స్పీకర్ ముచ్చటించా రు.అనంతరం కుమ్మరి,కుర్మ, గాండ్ల కులసంఘాల ఉమ్మడి స్మశాన వాటికకు అవసరమ య్యే పలు పనుల విషయమై స్పీకర్ ని కోరగా,అందుకు స్పీకర్ సానుకూలంగా స్పందించారు.అదేవిధంగా వడ్ల కమ్మరి కులభవన నిర్మాణానికి స్పీకర్ రూ.10 లక్షలు మంజూ రు చేయడం పట్ల కుల సంఘా ల ప్రతినిదులు స్పీకర్ నీ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్,కులకర్ణి అనిల్, కోటగిరి కుమ్మరి,కుర్మ,గాండ్ల, వడ్ల కమ్మరి కుల సంఘాల అద్యక్షులు కుమ్మరి గంగారాం, గోక శంకర్,గాండ్ల సతీష్,కమ్మరి గంగాధర్,కులసంఘాల ప్రతి నిధులు గాండ్ల భూమయ్య, కుమ్మరి హమ్మండ్లు,కమ్మరి విజేయ్,ఆయా కుల సంఘాల సభ్యులు ఉన్నారు.