Tuesday, 3 November 2026

బండ్లగూడ ఆర్టీసీ డిపో ముందు కార్మికుల ఆందోళన

హైదరాబాద్‌:  ఉద్యోగుల పట్ల బండ్లగూడ డిపో అధికారుల తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో ముందు భైఠాయించి నిరసనకు దిగడంతో ఉదయం 5 గంటల నుంచి ప్రారంభం కావాల్సిన బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. డిపోలో కార్మికులకు సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. లింక్‌ డ్యూటీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. డిపో డీఎం, చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ను బదిలీ చేయాలని నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *