*బండ లింగపూర్, జగ్గసాగర్ లను రెవెన్యూ మండలాలు గా ఏర్పాటు చేయాలి*.
మెట్పల్లి టౌన్ : ఆగస్టు09
(జనంసాక్షి)
మెట్పల్లి డివిజన్ పరిధిలోని బండ లింగపూర్,జగ్గసాగర్ గ్రామాలను, ఆ గ్రామ ప్రజల కోరిక మేరకు రెండు మండలాలు గా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్ యామ రాజయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎర్రోళ్ల హనుమండ్ల యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ఆదేశాల మేరకు నేడు మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో మార్లు రెండు గ్రామాలను రెవెన్యూ మండలాలు గా ఏర్పాటు చేయాలని ప్రజలు ఆందోళనలు,ధర్నాలు నిర్వహించారని, ఇప్పటికీ ఆందోళనలు ఆగడం లేదని అన్నారు. సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాలను కలిపి సిరిసిల్ల జిల్లా గా ఏర్పాటు చేసినట్లు, ఈ రెండు గ్రామాలను రెవెన్యూ మండలాలు గా ఏర్పాటు చేయడం అసాధ్యమేమీ కాదని,ప్రజల కోరికను మన్నించి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రెండు గ్రామాలను రెవెన్యూ మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ రెండు గ్రామాల ప్రజలకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఇట్టి సమావేశంలో నాయకులు సీనియర్ న్యాయవాది సురభి అశోక్, కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పెంట ప్రణయ్, రైసోద్దీన్, కంతి హరికుమార్,రాజ్ ,ఉదయ్, విమల్,తదితరులు పాల్గొన్నారు.