హైదరాబాద్: తెరాస పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ కారణంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) రూ. 6 కోట్ల రాబడిని కోల్పోయింది. తెలంగాణలోని పలుచోట్ల జరిగిన ఆందోళనల్లో రెండు బస్సులు దహనంకాగా, మూడు బస్సులు ధ్వంసమయ్యాయి. ఇవిగాక ఆర్టీసీకి మరో 40 లక్షల ఆస్తి నష్టం సంభవించింది.




