బంద్ పాటించాలని మావోయిస్టుల వాల్‌పోస్టర్లు
కరీంనగర్, నవంబర్ 11 : మహదేవ్‌పూర్, ముత్తాపూర్ మండలాల్లో బంద్ పాటించాలని మావోయిస్టులు వాల్‌పోస్టర్లు అతికించారు. రెండు రోజుల క్రితం మహమత్తారంలోని కార్యదర్శిని హతమార్చడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో మావోయిస్టులు ఆ రెండు ప్రాంతాలలో బంద్‌కు పిలుపునిచ్చారు. పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పై రెండు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కార్యదర్శి పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా మారారంటూ భూర్లగూడెంకు చెందిన రాఘవయ్య అనే కార్యదర్శిని హతమార్చారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న బంద్‌ను కూడా విజయవంతం చేయాలని మావోయిస్టులు వాల్ పోస్టర్లలో పేర్కొనడం చర్చనీయాంశమైంది.