Thursday, 5 November 2026

సబ్‌స్టేషన్‌ పనులను అడ్డుకున్న కన్నాపూర్‌ వాసులు

కరీంనగర్‌, నవంబర్‌ 11 : కన్నాపూర్‌ గ్రామంలో సబ్‌స్టేషన్‌ నిర్మాణపనులను నిలిపివేయాలని  స్థానికులు అడ్డుకున్నారు. కరీంనగర్‌ మండలంలోని కన్నాపూర్‌ గ్రామస్థులు తమ భూములలో సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేపట్టడం సమంజసం కాదని స్పష్టం చేసినప్పటికీ కూడా అధికారులు వినిపించుకోకుండా నిర్మాణ పనులు చేపట్టడం విడ్డూరంగా ఉందని గ్రామస్థులు నిరసన తెలిపారు. ప్రభుత్వ భూములలో ఏర్పాటు చేయాల్సిన సబ్‌స్టేషన్‌లను పట్టా భూములలో ఏర్పాటు చేయడం దారుణమైన చర్య అని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వకపోగా నిర్మాణ చేపట్టడం మంచి పద్ధతి కాదని ఆందోళనకు దిగారు. దీంతో పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *