Tuesday, 3 November 2026

వృద్ధుల సేవకులకు అవార్డు కోసం దరఖాస్తులు

హైదరాబాద్‌ సిటీ: వయోవృద్ధుల దినోత్సవాన్ని పురష్కరించుకొని వయో వృద్ధులకు సేవ చేస్తున్న వారికి అవార్డులు అందించనున్నట్లు హైదరాబాద్‌ జిల్లా వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు సుదర్శన్‌ తెలిపారు. వయోవృద్ధులకు సేవలందిస్తున్న వ్యక్తులు అవార్డులు పొందేందుకు దరఖాస్తులను ఈ నెల 24 వరకు తమకు అందజేయవచ్చని తెలిపారు. గతంలో చేసిన సేవలు, వాటికి సంబంధించిన ఫొటోలు వికలాంగు ల, వయో వృద్ధుల సంక్షేమశాఖ, మనోరంజన్‌ కాంప్లెక్స్‌, బ్లాక్‌-04లో సమర్పించుకోవాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *