Wednesday, 4 November 2026

బడిబాటలో ప్రభుత్వ ఉపాధ్యాయులు

వీణవంక జూన్ 7 (జనం సాక్షి ) వీణవంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు 5వ రోజు బడిబాట కార్యక్రమాన్ని స్థానిక మండల కేంద్రంలోనీ ఎస్సీ కాలనీ, బ్యాంక్ కాలనీ, బుడగ జంగాల కాలనీలో నిర్వహించి పలువురు విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓరెం ప్రభుత్వ ఉపాధ్యాయులుభానుచందర్ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొని విద్యారంగ అభివృద్ధికి, పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చేస్తున్న కృషి పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం “మన ఊరు- మనబడి” కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, డైనింగ్ హాల్స్, ఆధునిక టాయిలెట్స్ ని సమకూరుస్తుందన్నారు. విద్యాబోధనలో గుణాత్మక మార్పుకై ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ చే డిజిటల్ విద్యా బోధనకై ఖరీదైన టీవీలను, గ్రీన్ చాక్ పీస్ బోర్డులను ఇప్పటికే ప్రభుత్వం సమకూర్చిందన్నారు. విద్యార్థులకు ఉదయం పోషక విలువలు కలిగిన రాగి జావా అందించడంతోపాటు, మధ్యాహ్న భోజనంలో మిక్స్ డ్ వెజిటేబుల్స్ ఉండేవిధంగా వంట మెనూను మార్పు చేసిందన్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, రెండు జతల దుస్తులతో పాటు ఈ సంవత్సరం నుండి ఉచితంగా నోట్ బుక్స్ ను అందించ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అందువల్ల అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అధునాతన సౌకర్యాలను ప్రభుత్వం సమకూరుస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.