Wednesday, 4 November 2026

వడ్లు కొనుగోలు చేయడం ప్రభుత్వానికి చేతనైత లేదు: వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి ప్రసాద్ ఆగ్రహం

వికారాబాద్ రూరల్ జూన్ 7 జనం సాక్షివికారాబాద్ జిల్లా లోని ఐకెపి సెంటర్లలో వడ్లు సకాలంలో కొనక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారని వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బుధవారం జిల్లా అధికార ప్రతినిధి వసంత్ కుమార్ తో కలిసి ధారుర్ మండలంలోని నాగారం ఐకెపి సెంటర్ ను సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా ఉందని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… దారూరులోని నాగారం ఐకెపి సెంటర్లో వ్యవసాయ అధికారులు 30 వేల బస్తాలు కేటాయించి అందులో కేవలం ఇప్పటివరకు 11 వేల బస్తాలు మాత్రమే కొనుగోలు చేసి అందులోను 9000 బస్తాలు మాత్రమే మిల్లులకు తరలించిన పరిస్థితి నెలకొందన్నారు. గత 15 రోజులుగా రైతులు ధాన్యం దగ్గరే ఐకెపి సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. ఋతపవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు యుద్ద ప్రాతిపదికన పూర్తిస్థాయిలో వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.