మంథని, జనంసాక్షి : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కే కనకయ్య, రాజేందర్ అవధాని, గట్టు వరలక్ష్మి, అరుణ, స్వరూప, జీనత్ ఉన్నిసా బేగం ఆధ్వర్యంలో శుక్రవారం బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీపాద కాలనీ, దొంతుల వాడలో ఇంటింటికి తిరిగి బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్య బోధన జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. తమ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను, పదవ తరగతి పాసైన విద్యార్థుల వివరాలతో కూడిన కరపత్రాలను విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అందజేశారు.మీ పిల్లలను తప్పనిసరిగా మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం ప్రతి విద్యార్థికి ఉచితంగా రెండు జతల స్కూల్ యూనిఫాంలు, సన్నబియ్యంతో మధ్యన భోజన పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అదే విధంగా ఉచితంగా పాఠ్యపుస్తకాలను కూడా పంపిణీ చేస్తున్నదని తెలిపారు.
బడిబాటలో ప్రభుత్వ ఉపాధ్యాయులు – ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించాలని ఇంటింటి ప్రచారం




