Thursday, 5 November 2026

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి  సిపిఐ రాష్ట్ర నాయకులు కే సారయ్య

టేకులపల్లి, జూన్ 9 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు కే సారయ్య అన్నారు. శుక్రవారం టేకులపల్లి మండల సిపిఐ ముఖ్య నాయకుల సమావేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు కే సారయ్య పాల్గొని మాట్లాడుతూ కొత్తగూడెంలో ఈనెల 11న జరుగు ప్రజా గర్జన బహిరంగ సభను జయప్రదం చేయాలని, ఈ సభకు వేలాదిగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చినటు వంటి హామీలు అమలు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, దళిత బంధు, గిరిజన బంధు అందరికీ వర్తింపజేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, సొంత స్థలం ఉన్నటువంటి పేదలకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు దేవరకొండ శంకర్, గూగులోతు రామ్ చందర్, ఏఐటియుసి జిల్లా నాయకులు మోజెస్,ఎజ్జు భాస్కర్, గూగులోతు శ్రీను, వాసం భద్రయ్య, అయిత శ్రీరాములు, భానోత్ వీరన్న, తేజావత్ లక్ష్మణ్, ఈసం నరేష్, బండా వెంకట్ నర్సు, సోనీ తదితరులు పాల్గొన్నారు.