Wednesday, 4 November 2026

బడి బాట కార్యక్రమం ప్రారంభం

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): బడీడు పిల్లలు బడిలో ఉండేలా ప్రభుత్వం రూపొందించిన ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమంను శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ -2 లో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంకతి వెంకన్న ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో చదువుకుని ప్రభుత్వం నుంచి అమలయ్యే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకరించాలని కోరారు.ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి చదువుకుంటే వచ్చే ఫలితాలను వివరించారు.ఈ కార్యక్రమంలో సెక్టొరియల్ ఆఫీసర్లు వై.రాంబాబు, జనార్ధన్, ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.