Wednesday, 4 November 2026

నాడు కరువు నేడు భూమికి భారమయ్యే పంట నాడు మొఘులుకు ముఖం నేడు రైతే రాజు

శివ్వంపేట జూన్ 3 జనంసాక్షి : ఒకప్పుడు తెలంగాణ రాకముందు ఈ ప్రాంతమంతా కరువు కాటకాలతో నేర్రెలు బారిన నేలలతో కరువు విలయ తాండవం చేస్తుండేదని నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత 9 సంవత్సరాల కాలంలో ఆకుపచ్చ తెలంగాణగా, అన్నపూర్ణగా ఈ తెలంగాణగా శోబిల్లుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు పేర్కొన్నారు. మండల పరిధిలోని గోమారం రైతు వేదికను సునీతారెడ్డి తో కలిసి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా మండల పరిధిలోని దొంతి రైతు వేదికను ఎంపీపీ కల్లూరి హరికృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. మండల కేంద్రమైన శివ్వంపేట రైతు వేదికను నర్సాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి తో కలిసి ఎంపీపీ కల్లూరి హరికృష్ణ,జడ్పిటిసి పబ్బా మహేశ్ గుప్తా లు ప్రారంభించారు. మండల పరిధిలోని రత్నాపూర్ రైతు వేదికను మండల పరిషత్ ఉపాధ్యక్షులు రేవ రమాకాంత్ రెడ్డి తో కలిసి శివ్వంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ చింతల వెంకట్ రాం రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు బతుకుతెరువు భారంగా మారిన తెలంగాణ నేడు యావత్ భారత్ దేశానికే అన్నం పెడుతూ అన్నపూర్ణ గా వెలుగొందుతుందన్నారు. నాడు వ్యవసాయం దండుగ అన్న వారికీ ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగలా చేశారని వారు గుర్తు చేశారు. రైతును కంటికి రెప్పల కాపాడుతూ రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి జలాలలను అందిస్తూ అక్కున చేర్చుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబాంధవుడయ్యారన్నారు. నాటి -నేటి పరిస్థితులు మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయని, రాష్ట్రాన్ని చూసి, ఇప్పుడు దేశం నేర్చుకునే పరిస్థితులున్నాయని, ప్రజలు అభివృద్ధిని గమనించాలని నలుగురికి తెలపాలనీ వారు అభిలాషించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సమాచార శాఖ అధికారి శాంతి కుమార్, జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి, ఆర్డీఓ శ్రీనివాసులు, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ బానోత్ రవి నాయక్, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, తహశీల్ధార్ శ్రీనివాస్ చారి, ఆత్మా కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, సర్పంచ్ లు లావణ్య మాధవ రెడ్డి, బొగ్గుల సాలమ్మ యాదగిరి, పాల వజ్జల ఫణి శశాంక్ శర్మ, బిఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్, టిఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ, ఉప తహసీల్దార్ ప్రభుదాస్, ఏవో లావణ్య, ఏఈవోలు రవి, మౌనిక, మాజీద్ లతో పాటుగా వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ లు రైతుబంధు సమితి అధ్యక్షులు, రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.