గద్వాల ప్రతినిధి జూన్ 07 (జనంసాక్షి):- నడిగడ్డ బహుజన ముద్దుబిడ్డ బిసి,ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ప్రజలు చైతన్యం కోసం తన తుదిశ్వాస వరకు ప్రజల మధ్య ఉన్న మన బహుజన నాయకుడు పరుమాల నాగరాజు గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా బుధవారం మద్యాహ్నం జిల్లా ఆసుపత్రిలో రోగులకు, రోగుల బంధువులకు పరుమాల నాగరాజు కుటుంబ సభ్యులు భార్య దాక్షాయణి, రేవతి,రాధాకృష్ణ,వేణుగోపాల్,వరుణ్ అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకుడు నాగర్ దొడ్డి వెంకట్రాములు పాల్గొని మాట్లాడుతూ ఆయన చూపిన మార్గం.ఆయన నడిచిన బాట,నేర్పిన విలువలు, ఎప్పుడూ మనకు మార్గదర్శకంగా ఉండాలని, బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్యా,రాజకీయంగా,ఆర్థిక,బలపడలనే లక్ష్యంతో ఈ ప్రాంతంలో పని చేశారని,ఆయన ఆశయం నెరవేరదు గాను బిసి, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ప్రజలు చైతన్యవంతులు కావాలని పరుమాల నాగరాజు కుటుంబ సభ్యులు,నాగర్ దొడ్డి వెంకట్రాములు పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు, అభిమానులు,శ్రేయోభిలాషిలు పాల్గొన్నారు
బడుగుల నాయకుడు కీ.శే. పరుమాల నాగరాజు… – పరుమాల నాగరాజు గారిని స్మరిస్తూ అన్నదాన కార్యక్రమం




