నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.నవయుగ వైతాళికుడు సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త సామాజిక విప్లవ కారుడు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి సమ సమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయులు మహాత్మ జ్యోతి రావ్ పులే అని మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయబాబు అన్నారు.మంగళవారం మహాత్మ జ్యోతి రావ్ పులే 197 వ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయబాబు.మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అశోక్ రెడ్డి.బిల్ కలెక్టర్లు,మున్సిపల్ సిబ్బంది,మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




