Thursday, 5 November 2026

మహిళా విద్య కోసం పాటుపడిన మహనీయుడు జ్యోతిరావు పూలే – ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుక

 

 

 

 

 

 

హుజూర్ నగర్ ఏప్రిల్ 11 (జనం సాక్షి): సమాజంలో మహిళల విద్య కోసం పాటుపడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి అన్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధన కోసం కృషి ప్రతి ఒక్కరూ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గాయత్రి భాస్కర్, ఓరుగంటి నాగేశ్వరరావు, కొమ్ము శీను, శ్రావణ్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.