హైదరాబాద్,ఫిబ్రవరి28(జనంసాక్షి): హైదరాబాద్‌లో ముగ్గురు నకిలీ వైద్యులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నల్లకుంట, కాచిగూడ, సుల్తాన్ బజార్‌లో క్లినిక్‌లు ఏర్పాటు చేసి వీరు వైద్యం చేస్తున్నారు. అయితే వీరు నకిలీ వైద్యులు అని తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఈ ముగ్గురు నకిలీ వైద్యులు అని తేలడంతో వారి ఆస్పత్రులకు వచ్చే పేషెంట్లు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. వీరంతా ఉన్న డిగ్రీలు పెట్టుకుని ఇంతకాలం పేషెంట్లను బురిడీ కొట్టించారు. వీరిపై అనుమానాలు రావడంతో విచారించి పట్టుకున్నారు.




